Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ శ్రీకాకుళం టూర్... మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి ఘోర పరాభవం

శ్రీకాకుళం : మాజీ కేంద్ర మంత్రి, వైసిపి నాయకురాలు కిల్లి కృపారాణికి సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురయ్యింది.

శ్రీకాకుళం : మాజీ కేంద్ర మంత్రి, వైసిపి నాయకురాలు కిల్లి కృపారాణికి సొంత జిల్లాలో చేదు అనుభవం ఎదురయ్యింది. అమ్మ ఒడి మూడో విడత నగదు విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కృపారాణి హెలీప్యాడ్ వెళ్లడానికి సిద్దమవగా అధికారులు ఆమెను అనుమతించలేదు. సీఎంకు ఆహ్వానం పలికేవారి జాబితాలో పేరు లేదంటూ ఆమెను అడ్డుకున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురయిన మాజీ మంత్రి సీఎంను కలవకుండానే వెనుదిరిగారు. కృపారాణి కోపంగా వెళ్లిపోతుంటే ఆపడానికి వైసిపి నాయకులు కొందరు ప్రయత్నించారు.  శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్రమంత్రిగా పనిచేసిన తాను ఎవరో జిల్లా కలెక్టర్, అధికారులకు తెలియదా...? నాకు జరిగిన అవమానం ఇక చాలు అంటూ కోపంగా అక్కడినుండి వెళ్లిపోయారు కృపారాణి.