ప్రభుత్వ మద్యం దుకాణంలో ఇంటి దొంగల చేతివాటం

కర్నూలు జిల్లా, శిరివెళ్ళ మండలం బోయలకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తున్న పలువురు సిబ్బంది రాత్రి సమయంలో అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

First Published Jul 3, 2020, 3:41 PM IST | Last Updated Jul 3, 2020, 3:41 PM IST

కర్నూలు జిల్లా, శిరివెళ్ళ మండలం బోయలకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పని చేస్తున్న పలువురు సిబ్బంది రాత్రి సమయంలో అక్రమంగా అమ్మకాలు జరుపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది గమనించిన ఓ యువకుడు దీన్ని వీడియో తీసి సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిబంధనలు ఉన్నప్పటికీ పలువురు సిబ్బంది రాత్రి సమయంలో మద్యం సీసాలను ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఈ విషయంలో ఆళ్లగడ్డ ఆప్కారి సీఐ కృష్ణ కుమార్ మాట్లాడుతూ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బందే ఈ అక్రమాలకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని  దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు.