అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఐచర్..

కర్నూలు, తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ శివారులో ఓ  ఐచర్ వాహనం అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. 

First Published Jul 26, 2020, 10:53 AM IST | Last Updated Jul 26, 2020, 10:53 AM IST

కర్నూలు, తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ శివారులో ఓ  ఐచర్ వాహనం అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో త్రుటిలో ప్రమాదం నుండి డ్రైవర్, క్లీనర్ తప్పించుకున్నారు. అనంతపురం జిల్లా కల్లూరు నుండి రాయచూరుకు పత్తి లోడుతో వెళ్లిన వాహనం తిరిగి వస్తుండగా జొన్నగిరి గ్రామం వద్ద  అదుపు తప్పి చెరువులోని దూసుకెళ్లింది. డ్రైవర్, క్లీనర్ కేకలు వేయడంతో అటుగా వెళ్లే  వాహనదారులు సహాయంతో చెరువు నుండి వారిద్దరూ బయటపడ్డారు.