Asianet News TeluguAsianet News Telugu

బోండా ఉమ కొడుకు, కేఈ కృష్ణమూర్తి సంగతేంటి..: అనంతబాబును అరెస్ట్ పై స్పందిస్తూ హోంమంత్రి సంచలనం

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అధికార వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, ఆ తర్వాతి పరిణామాలపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. 

First Published May 24, 2022, 9:57 AM IST | Last Updated May 24, 2022, 9:57 AM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అధికార వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, ఆ తర్వాతి పరిణామాలపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో ఇప్పటికే పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీన్నిబట్టే ఈ విషయంలో వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత పారదర్శకగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది.    అయితే సుబ్రహ్మణ్యం హత్య విషయంలో ప్రతిపక్ష నాయకులు ఏదేదో మాట్లాడున్నారని... కానీ టిడిపి ప్రభుత్వ హయాంలో వారేం చేసారో హోమంత్రి గుర్తుచేసారు. గతంలో బోండా ఉమ కొడుకు ఓ వ్యక్తిని చంపింది. కర్నూల్ లో వైసిపి నాయకుడి హత్యలో కేఈ కృష్ణమూర్తి హస్తం వుందన్నది అందరికీ తెలుసు... వీరిని ఆనాటి టిడిపి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఆరోజు అధికారంలో వున్న టిడిపి ప్రభుత్వం హంతకుల పక్షాన నిలబడింది కానీ నేడు సీఎం జగన్ పేదలు, బడుగుబలహీనవర్గాలు, దళితులు, న్యాయం పక్షాన నిలబడ్డారని అన్నారు. తప్పుచేసిన వారు ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టుతో రుజువయ్యిందని హోంమంత్రి వనిత తెలిపారు.