Video : అనకాపల్లిలో సందడి చేసిన చందమామ
విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ సెంట్రల్ తన నూతన వ్యాపార శాఖను బుధవారం నాడు ప్రారంభించింది.
విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ సెంట్రల్ తన నూతన వ్యాపార శాఖను బుధవారం నాడు ప్రారంభించింది. ప్రముఖ సినీహీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో షోరూమ్ ప్రారంభించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్నాథరావు నాయుడు రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి అతిధిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హాజరయ్యారు.