తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డ్... 30 ఏళ్ళ తర్వాత మళ్లీ ఇప్పుడే...

కర్నూలు: ఈ ఏడాది తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు నెలకొల్పింది. 30 ఏళ్లుగా సాధ్యంకానిది ఈ ఏడాది సాధ్యమయ్యింది. 

First Published May 24, 2022, 1:24 PM IST | Last Updated May 24, 2022, 1:24 PM IST

కర్నూలు: ఈ ఏడాది తుంగభద్ర జలాశయం సరికొత్త రికార్డు నెలకొల్పింది. 30 ఏళ్లుగా సాధ్యంకానిది ఈ ఏడాది సాధ్యమయ్యింది. ఎండలు మండిపోయే మే నెలలో ప్రతిసారీ తుంగభద్ర జలాశయంలో నీటినిల్వ తగ్గుతుంది... కానీ ఈసారి మాత్రం మే నెలలో రికార్డు స్థాయిలో 34 టీఎంసీల నీటి నిల్వ వుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయంకు వరద నీరు కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం ఇన్ ఫ్లో  26,987 క్యూసెక్కులుగా వుంటే ఔట్ ఫ్లో 584 క్యూసెక్కులు వుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1608.95 అడుగులుగా వుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ దాదాపు 34 టీఎంసీలుగా వుంది