కర్నూలులో భారీ వర్షాలు.. హంద్రీ నదికి చేరుతున్న వరదనీరు..
కర్నూలులో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా హంద్రీ నదికి వరద నీరు చేరుతోంది.
కర్నూలులో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా హంద్రీ నదికి వరద నీరు చేరుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కర్నూలు లోని కల్లూరు బ్రిడ్జి మీదినుండి నీరు ఉప్పొంగుతోంది. వరదనీటితో నగరంలోని వక్కెర వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో తో కల్లూరు నుండి కొత్త బస్ స్టాండ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి.