ఏపీలో భారీ వర్షాలు ... గుంటూరు జిల్లాలో నీటమునిగిన పంటలు

గుంటూరు: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు తోడు గ్రామాల్లోని మురుగునీరు తమ పొలాల్లోకి చేరడంతో పంట నీటమునిగి తీవ్రంగా నష్టపోతున్నామంటూ గుంటూరు జిల్లా నూతక్కి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. 

First Published Oct 7, 2022, 5:15 PM IST | Last Updated Oct 7, 2022, 5:15 PM IST

గుంటూరు: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు తోడు గ్రామాల్లోని మురుగునీరు తమ పొలాల్లోకి చేరడంతో పంట నీటమునిగి తీవ్రంగా నష్టపోతున్నామంటూ గుంటూరు జిల్లా నూతక్కి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. గ్రామానికి ఆనుకుని వున్న గోదావరి పొంగిపోర్లి వరద నీరు పొలాల్లోకి చేరుతోందని రైతులు వాపోయారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల మురుగునీరు కూడా తమ పొలాల్లోకి చేరుతోందని నూతక్కి రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. ఇలా ఈ సీజన్ లో వేసిన పసుపు, అరటి, కంద, క్యాలీఫ్లవర్ ,క్యాబేజీ వంటి పంటలు నీట మునిగాయని బాధిత రైతులు తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యకు పరిష్కారం చూపాలని నూతక్కి రైతులు కోరుతున్నారు.