Asianet News TeluguAsianet News Telugu

వర్షాలకు పోటెత్తుతున్న సముద్రం.. మత్స్యకారుల పడవ బోల్తా..

పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీర ప్రాంతం వద్ద పడవ బోల్తా పడిన సంఘటనలో  ఒకరు గల్లంతయ్యారు. 

Jul 15, 2020, 5:39 PM IST

పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీర ప్రాంతం వద్ద పడవ బోల్తా పడిన సంఘటనలో  ఒకరు గల్లంతయ్యారు. ఉదయం ఆరుగంటల ప్రాంతంలో 8 మంది మత్యకారులు చేపల వేటకు బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసే సరికి కెరటాల ఉదృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  మేరుగు జగ్గ (30) అనే వ్యక్తి గల్లంతు కాగా మిగిలిన ఏడుగురు మత్యకారుల సముద్రంలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన జగ్గకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.