బుట్టాయి గూడెంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.. ఆళ్ళ నాని
పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడేంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీ చేశారు.
పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడేంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తనిఖీ చేశారు. కమ్యూనిటీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్స్ అందుబాటులో ఉండాలని, హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న మెడికల్ సిబ్బంది పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఏజెన్సీ లో వెంటనే మొబైల్ ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలని ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. బుట్టాయిగూడంలో 10ఎకరాలు స్థలంలో 75కోట్లు రూపాయలతో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నామన్నారు.