గుంటూరులోని జిన్నా టవర్ కూల్చేస్తాం...: బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి సంచలనం

విజయవాడ: గుంటూరు పట్టణంలోని కూడలితో పాటు టవర్ కు ఉన్న దేశద్రోహి మహ్మద్ అలీ జిన్నా పేరును తొలగించాలన్న బిజెపి డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకురాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి కూడా మద్దతిచ్చారు. గుంటూరులో దేశద్రోహి జిన్నా పేరిట వున్న సెంటర్ విషయంలో తమ పార్టీ నేత సత్య కుమార్ చేసిన వ్యాఖ్యల్లో ఏ వివాదం లేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. వారి వ్యాఖ్యలు పూర్తిగా సమర్థనీయమని... వెంటనే జిన్నా సెంటర్, టవర్  పేరును మార్చాలని సూచించారు. లేదంటే ఆ టవర్ ను కూల్చి సెటర్ పేరు మారుస్తామని విష్ణువర్ధన్ హెచ్చరించారు. దేశ రాజధానిలోనే ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చాం... రాష్ట్ర రాజధానిలో మార్చలేమా! అని అన్నారు.

First Published Dec 30, 2021, 3:15 PM IST | Last Updated Dec 30, 2021, 3:15 PM IST