పోలీసువ్యవస్థకు ఆ దౌర్భాగ్య స్థితి వైసీపీ ప్రభుత్వం వల్లే.. గోరంట్ల
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాలని గవర్నర్ చెప్పడం శుభపరిణామం అని టీడీపీ ఎమ్మెల్యేగోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ని ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాలని గవర్నర్ చెప్పడం శుభపరిణామం అని టీడీపీ ఎమ్మెల్యేగోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తమ నిర్ణయాలను, చర్యలను కోర్టులు తప్పపడుతున్నా ప్రభుత్వానికి జ్ఞానోదయం కావడం లేదు. పోలీస్ వ్యవస్థ పనితీరుపై హైకోర్టు స్పందన చూశాకైనా ప్రభుత్వంలో మార్పులేదు. ఇష్టారాజ్యంగా చేస్తాము.. మేము చెప్పేదే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక దళితులను అణగదొక్కడమే జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ప్రతిపక్షం హెచ్చరిస్తున్నా పోలీసులు, అధికారులు పద్దతి మార్చుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేని దుస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది. డీజీపీ స్వామిభక్తిలో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు.