గోదావరి జిల్లాల్లో సంక్రాంతి శోభ... కిలో మీటర్ భోగి దండతో గుమ్మిలూరువాసుల రికార్డ్

కోనసీమ : సంక్రాంతి పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. 

First Published Jan 9, 2023, 12:55 PM IST | Last Updated Jan 9, 2023, 12:54 PM IST

కోనసీమ : సంక్రాంతి పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. చల్లటి పల్లెల్లో వెచ్చటి బోగి మంటలు, అందరూ కలిసి సరదాగా ఆడే కోడిపందేలు, ఇళ్లముందు ఆడపడుచుల ముగ్గులు... ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు  సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. కొన్ని ప్రాంతాలయితే సంక్రాంతి సంబరాలతోనే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపును పొందాయి. అలాంటి గ్రామాల్లో ఒకటే అంబేద్కర్ కొనసీమ జిల్లాలోని అలమూరు మండలం గుమ్మిలూరు.  సంక్రాంతి భోగిమంటలతో గుమ్మిలూరు ప్రత్యేక గుర్తింపు పొందింది. పశుసంపదకు ప్రసిద్దిగాంచిన ఈ గ్రామంలో ఆవు పేడతో పిడకలు చేసి బోగిదండలు తయారు చేస్తుంటారు. దండ అంటే ఏ మూరో, మీటరో అనుకుంటే మీరు పొరపడినట్లే... ఏకంగా ఆరు టన్నుల పేడతో కిలోమీటర్ పిడకల దండను తయారుచేసారు. ఇలా గుమ్మిలేరులో ముందుగానే సంక్రాంతి సందడి మొదలయ్యింది. గ్రామస్తులంతా కలిసి భారీ భోగిదండను తయారుచేసి రికార్డ్ సృష్టించారు.