కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్...!
అమరావతి : కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది.
అమరావతి : కృష్ణా జిల్లా గుడివాడలో గోవా కల్చర్ వెలుగు చూసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి చెందిన గుడివాడ కె కన్వెన్షన్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా జూద క్రీడలు జోరుగా సాగాయి. గుడివాడ వైసీపీ నేతలు తగ్గేదే లే అంటూ మందేసి చిందేస్తున్నారు. కోడి పందాలు, పేకాట శిబిరాలు, గుండాట, నంబర్ల ఆటలతో పాటుగా ప్రత్యేకంగా క్యాసినో ఏర్పాటు చేశారు. 10 వేల ప్రవేశ రుసుం చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతి లభిస్తుంది. గోవాను తలిపించేలా లోపల ఏర్పాట్లు చేశారు. స్పెషల్ ఎఫెక్ట్‌గా చీర్ గాళ్స్ ద్వారా నృత్య ప్రదర్శనలు సైతం ఇప్పిస్తున్నారు. తీన్ పత్తి, క్యాషియోన్, మూడు ముక్కలాటలు మరోవైపు జరుగుతున్నాయి. ప్రత్యేక లైటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసి, సినిమా పాటలకు యువతులతో నృత్యాలు చేయిస్తున్నారు. క్యాసినో లోపల సెల్ ఫోన్ల ద్వారా వీడియోలు చిత్రీకరించకుండా.. హైదరాబాద్‌కు చెందిన బౌన్సర్లను నిఘాకు వినియోగించారు.