జోరుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లు ... సుందరంగా ముస్తాబవుతున్న విశాఖ

విశాఖపట్నం : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం బీచ్ సిటీ విశాఖపట్నం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. 

First Published Feb 28, 2023, 12:17 PM IST | Last Updated Feb 28, 2023, 12:17 PM IST

విశాఖపట్నం : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం బీచ్ సిటీ విశాఖపట్నం సర్వాంగసుందరంగా ముస్తాబవుతోంది. బీచ్ లతో పాటు నగరంలోని రోడ్లు, పార్కులు, ఇతర ప్రదేశాలను వైసిపి ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇక సమ్మిట్ జరిగే ఏయూ గ్రౌండ్స్ లో ఇప్పటికే జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులు శ్రమిస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో జరిగే ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.