పుష్ఫ మూవీ స్టైల్లో గంజాయి స్మగ్లింగ్... స్కార్పియో వాహనాన్ని నీటిలో దాచిన స్మగ్లర్లు
విశాఖ : ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా సూపర్ హిట్టయ్యింది.
విశాఖ : ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాలో పోలీసులకు చిక్కకుండా హీరో ఓసారి బావిలో, మరోసారి నీటి ప్రాజెక్ట్ లో ఎర్రచందనం దుంగల్ని దాచే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. పుష్ఫ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమోగానీ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో గంజాయి స్మగ్లర్లు అతితెలివి ప్రదర్శించారు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంబడించటంతో తప్పించుకునేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారు. పోలీసుల నుండి తప్పించుకునేందుకు గంజాయితో కూడిన స్కార్పియో వాహనాన్ని మితిమీరిన వేగంతో పోనిచ్చి భూపతిపాలెం రిజర్వాయరులోనికి దింపారు స్మగ్లర్లు. ఇలా రిజర్వాయరు నీటి అడుగు భాగంలో దాచే ప్రయత్నం చేసారు. కానీ పోలీసులు ఇది గుర్తించి నీటిలోని వాహనాన్ని బయటకు తీసి గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. స్మగ్లర్లలో ఒకడు పట్టుబడగా మరొకడు పరారయ్యాడు.