Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాబ్రికేటెడ్ కేసులతో అరెస్టు చేయడమేంటీ.. ఏసీబీ తీరుపై పితాని

ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం మీద మాజీమంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. 

ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం మీద మాజీమంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. అచ్చెన్నాయుడును విచారించకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నారా..? ఒక ఎమ్మెల్యేను విచారించకుండా నేరుగా అదుపులోకి తీసుకోవచ్చా.. అని పితాని ప్రశ్నించారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే ఏసీబీ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి..మరీ ఆ నిబంధనను పాటించారా అని అడిగారు. ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తుంటాయి అని.. కానీ విచారించకుండా అదుపులోకి తీసుకోవడం మాత్రం సరికాదన్నారు.