Video news : మాజీ మంత్రి నారాయణపై దాడి: చిరిగిన షర్ట్, పగిలిన కారు అద్దాలు

మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత, పొంగూరు నారాయణపై అనంతపురంలో విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. 

First Published Dec 4, 2019, 12:06 PM IST | Last Updated Dec 4, 2019, 4:59 PM IST

మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత, పొంగూరు నారాయణపై అనంతపురంలో విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. నారాయణ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్ది సంఘాల నేతలు నారాయణను నిలదీసారు.  నారాయణ అనుచరులకు, విద్యార్థి సంఘాల నేతలకు మధ్య  తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నారాయణ షర్ట్ చిరిగింది. కారు 
అద్దాలు పగిలాయి. దీంతో పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి నారాయణ తన అనంతపురం పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని వెనుదిరిగారు.