కాల్పుల మోతతో ఉలిక్కిపడ్డ మన్యం.. ఎదురుకాల్పుల్లో గాయపడ్డ మావోలు..
ఆంధ్రప్రదేశ్, విశాఖ జిల్లా ఏజెన్సీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, విశాఖ జిల్లా ఏజెన్సీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని పెదబయలు మండలం లండులు అటవీ ప్రాతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆదివారం భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో రెక్కీ నిర్వహించిన పోలీసులకు లండులు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారస పడటంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వర్గాలు ప్రకటించాయి. అయితే సంఘటనా స్థలంలో మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రితోపాటు, రక్తం మరకలు కనిపించాయని, గాయపడినవారు లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తామని DSPరాజకమల్ తెలిపారు.