విశాఖ ఫార్మాసిటీలో భారీ పేలుడు.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు...

విశాఖ రాంకీ ఫార్మాసిటీలో ఉన్న సాల్వెంట్స్‌ కంపెనీలో ట్యాంకర్‌ పేలిన ప్రమాదంలో సీనియర్‌ కెమిస్ట్‌ నాగేశ్వరరావు చనిపోయారు.

First Published Jul 14, 2020, 11:30 AM IST | Last Updated Jul 14, 2020, 11:30 AM IST

విశాఖ రాంకీ ఫార్మాసిటీలో ఉన్న సాల్వెంట్స్‌ కంపెనీలో ట్యాంకర్‌ పేలిన ప్రమాదంలో సీనియర్‌ కెమిస్ట్‌ నాగేశ్వరరావు చనిపోయారు. గత రాత్రి విశాఖ రాంకీ ఫార్మాసిటీలోని శిశాఖ సాల్వెంట్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  అయితే చనిపోయిన విషయంమీద కంపెనీ యాజమాన్యం, పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటనా చెయ్యలేదు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లేశ్‌ (33) గాజువాకలోని ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నాడు.  ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలం దగ్గర 15 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. 15 నుంచి 20 రసాయన డ్రమ్ములు పేలాయని అంచనా.  పరిశ్రమ దగ్గర్లోకి ఎవరూ వెళ్లకుండా అన్ని దారుల్నీ పోలీసులు మూసివేశారు. రాంకీ ఫార్మా సంస్థ దగ్గర పోలీసులు భారీగా ఉన్నారు.