నెల్లూరులో హృదయవిదారక ఘటన... కన్నకూతురు మృతదేహాన్ని బైక్ పై తరలించిన తండ్రి

తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో నిన్నటికి నిన్న కన్న కొడుకు మృతదేహాన్ని తండ్రి భుజానెత్తుకుని బైక్ పై ఇంటికి తరలించిన ఘటన చోటుచేసుకుంది.

First Published May 6, 2022, 11:33 AM IST | Last Updated May 6, 2022, 11:33 AM IST

తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో నిన్నటికి నిన్న కన్న కొడుకు మృతదేహాన్ని తండ్రి భుజానెత్తుకుని బైక్ పై ఇంటికి తరలించిన ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఇదే నెల్లూరు జిల్లాలో ఇలాంటి అమానుషమే చోటుచేసుకుంది. దొరవారిసత్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి అక్షయ ప్రమాదవశాత్తు చెరువులో పడింది. అయితే వెంటనే చిన్నారిని నీటిలోంచి బయటకి తీసి తల్లిదండ్రులు నాయుడుపేట హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే అక్షయ మృతిచెందినట్లు డాక్టర్లు స్పష్టం చేసారు.

కూతురు చనిపోయి పుట్టెడు ధు:ఖంలో వున్న తల్లిదండ్రులను వైద్యసిబ్బంది తీరు మరింత బాధించింది. కూతురు మృతదేహాన్ని తరలించాల్సిందిగా 108 అంబులెన్స్ సిబ్బందిని కోరగా వారు నిబంధనల పేరిట అందుకు నిరాకరించారు. ఆ తల్లిదండ్రులకు ప్రైవేట్ వాహనాల్లో తరలించే ఆర్థిక స్థోమత లేదు. దీంతో ఆ తండ్రి కన్నీటిని దిగమింగుకుని కూతురు మృతదేహాన్ని భుజానేసుకుని బైక్ పైనే ఇంటికి తరలించాడు. ఈ ద‌ృశ్యం చూసేవారినీ కంటతడి పెట్టించింది.