పంటలు నాశనం చేసి పొలాల్లోంచి రోడ్లు... దాచేపల్లిలో సిమెంట్ కంపనీ ఆగడాలు
పల్నాడు : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు రైతులు స్థానికంగా వున్న ఓ సిమెంట్ కంపనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.
పల్నాడు : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు రైతులు స్థానికంగా వున్న ఓ సిమెంట్ కంపనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమ భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు శ్రీ సిమెంట్ కంపనీ యాజమాన్యం ప్రయత్నిస్తోందని... ఇందులో భాగంగానే తాజాగా చేతికందివచ్చి పంటలు నాశనం చేసి రోడ్లు వేస్తోందని ఆరోపించారు. గత సంవత్సర కాలంగా తమకు ఇష్టంలేకున్నా భూములు అమ్మాలని ఒత్తిడి తెచ్చారని... అయినా లొంగకపోవడంతో వినుగొండ మాణిక్యాలరావు అనే వ్యక్తి పేరుపై దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వాపోయారు. ఇప్పుడు ఎవరూ లేని సమయంలో పంటలను నాశనం చేసి భూముల్లో రోడ్లు వేస్తున్నారని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేసారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నష్టపోయిన రైతుల డిమాండ్ చేస్తున్నారు.