నందిగామలో మిర్చి రైతుల ఆందోళన... పోలీసులతో అన్నదాతల వాగ్వాదం, తోపులాట

కృష్ణా జిల్లా నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ వినతిపత్రం ఇవ్వడానికి రైతులంతా ర్యాలీగా నందిగామ ఏడి కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడినుండి జాతీయ రహదారిపైకి చేరుకున్న రైతులు బైటాయించి ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర రైతు సంఘం నాయకులు నరసింహారావుకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 
 
First Published Dec 17, 2021, 3:40 PM IST | Last Updated Dec 17, 2021, 3:40 PM IST