విశాఖ జిల్లలో తహశీల్ధారు కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండల తహశీల్థారు కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది.
విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండల తహశీల్థారు కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. సోమవారం ఉదయం పెదవుప్పలం గ్రామానికి చెందిన రైతు పోలవరపు రమణ పేరిట వారసత్వంగా వచ్చిన 1.13 సెంట్లు మెట్టుభూమి వుంది.. తండ్రి అనంతరం రెవెన్యూ రికార్డులలో పేరు మార్పిడి చేసినపుడు 1.13 సెంట్లకు గానూ,0.77 సెంట్లు గా నమోదు చేసియున్నారు.గ్రామ వీఆర్వో ఈశ్వరరావు వద్దకు గడచిన ఎనిమిది నెలలుగా డాక్యుమెంట్లతో తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకపొయింది. దీనితో న్యాయం చేయమని ఆత్మహత్యాయత్నం చేసాడు .