కోనసీమలో అద్భుతాలు సృష్టిస్తున్న టెకీ ఫార్మర్... ఎర్ర బెండ సాగు
కోనసీమ : వాడు ఎక్కడున్నా రాజేరా... బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ ను ఉద్దేశించిన డైలాగ్ గుర్తుండే వుంటుంది.
కోనసీమ : వాడు ఎక్కడున్నా రాజేరా... బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ ను ఉద్దేశించిన డైలాగ్ గుర్తుండే వుంటుంది. ఈ డైలాగ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ భీమాల రాఘవేంద్రకు సరిగ్గా సరిపోతుంది. ఇంజనీరింగ్ చేసిన రాఘవేంద్ర చెన్నైలో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసాడు. అయితే వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగాన్ని వదిలేసి కూరగాయల సాగువైపు అడుగేసాడు. కానీ అందరు రైతుల మాదిరిగా సాధారణ కూరగాయల సాగు కాకుండా కొత్తగా ఆలోచించి ఎర్ర బెండ సాగు చేస్తున్నాడు. ఇలా కొత్త సాప్ట్ వేర్లను రూపొందించిన చేతులతో కొత్త రకం కూరగాయలు సాగుచేస్తూ 'వీడు ఎక్కడున్నా టెకీనే (టెక్నాలజీ ఎక్స్ ఫర్ట్) ' అని నిరూపించాడు.