తాడేపల్లిలో ప్రార్థనల పేరిట పాస్టర్ నిర్వాకం... ఇద్దరు ఆడబిడ్డలతో తల్లి కన్నీటిపర్యంతం
తాడేపల్లి : దైవ ఆరాధన చేస్తూ మంచీ చెడు చెప్పే పాస్టరే తమను నిండా ముంచాడంటూ ఓ కుటుంబం ఆరోపిస్తోంది.
తాడేపల్లి : దైవ ఆరాధన చేస్తూ మంచీ చెడు చెప్పే పాస్టరే తమను నిండా ముంచాడంటూ ఓ కుటుంబం ఆరోపిస్తోంది. పాస్టర్ మాయమాటలు నమ్మి నగదు, బంగారంతో పాటు 9 సెంట్ల స్థలాన్ని కోల్పోయామని... ఇప్పుడు ఇంటి అద్దె కూడా కట్టలేక రోడ్డునపడ్డామని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో వెలుగుచూసింది. కృష్ణా జిల్లా పోరంకికి చెందిన పాస్టర్ విజయ్ బాబును తాడేపల్లి వాసి పీటర్ పాల్ ఎంతగానో నమ్మాడు. పాస్టర్ మాటలు నమ్మి భార్య మెడలోని బంగారాన్ని అమ్మిమరీ కారు కొన్న పీటర్ తానే డ్రైవర్ గా పాస్టర్ వద్ద పెట్టాడు. అంతేకాదు పీటర్ పేరిట వున్న 9 సెంట్ల భూమిని బలవంతంగా మరొకరికి రాయించాడు. ఇలా పీటర్ దగ్గరున్న డబ్బులు, ఆస్తులను కొల్లగొట్టి పాస్టర్ నిండాముంచాడు. సర్వం కోల్పోయిన పీటర్ కుటుంబం ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేక రోడ్డునపడింది. తమను మోసం చేసిన పాస్టర్ విజయ్ బాబుపై చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కన్నీరుపెట్టుకుంటూ వేడుకున్నారు పీటర్ భార్య శైలజ.