Asianet News TeluguAsianet News Telugu

కట్టలకు కట్టలు దొంగనోట్లు ప్రింటింగ్... గురజాలలో కిలాడీ ముఠా అరెస్ట్

పల్నాడు : ఇంట్లోనే ఓ కంప్యూటర్, ప్రింటర్ సాయంతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ముఠాను గురజాల పోలీసులు అరెస్ట్ చేసారు. 

పల్నాడు : ఇంట్లోనే ఓ కంప్యూటర్, ప్రింటర్ సాయంతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ముఠాను గురజాల పోలీసులు అరెస్ట్ చేసారు. పల్నాడు జిల్లా గురజాల మండలం చర్లగుడి గ్రామంలో ఓ ఇంట్లో దొంగనోట్లను ముద్రిస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారం అందింది. దీంతో ఈ వ్యవహారంపై నిఘాపెట్టి దొంగనోట్ల వ్యవహారం నిజమేనని నిర్దారించుకున్న పోలీసులు ఇంటిపై ఒక్కసారిగా దాడిచేసారు. అక్కడ 500,200, 100 రూపాయల ఫేక్ కరెన్సీ నోట్లకట్టలను పోలీసులు గుర్తించారు. ఇలా మొత్తం 48 లక్షల యాబై వేల నకిలీ కరెన్సీతో వాటి ముద్రణకు  ఉపయోగిస్తున్న కంప్యూటర్, ప్రింటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గురజాల డిఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. 

ఇదిలావుంటే ఇదే గురజాలలో అక్రమంగా తరలిస్తున్న లారీ గుట్కా లోడ్ ను ఎస్ఈబి పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గుట్కా విలువ సుమారు 25 లక్షల రూపాయలు వుంటుందని అధికారులు తెలిపారు.