ఆపరేషన్లు చేసే రోబో... విజయవాడలో ''సర్జికల్ రోబో'' సేవలు ప్రారంభం

విజయవాడ : భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సరికొత్త వైద్యసేవలను ప్రారంభించారు. 

First Published Feb 12, 2023, 2:30 PM IST | Last Updated Feb 12, 2023, 2:36 PM IST

విజయవాడ : భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సరికొత్త వైద్యసేవలను ప్రారంభించారు. విజయవాడ ప్రశాంత్ హాస్పిటల్లో అత్యాధునికి టెక్నాలజీని ఉపయోగించి తయారుచేసిన ''సర్జికల్ రోబో'' సేవలు ఉపరాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభమయ్యాయి.  ఇప్పటికే అన్ని రంగాల్లో మాదిరిగానే వైద్య రంగంలోనే రోబో సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆపరేషన్ థియేటర్ లో రోబో సేవలను ఉపయోగించడం విదేశాలు, పెద్ద పెద్ద నగరాలకే పరిమితమయ్యింది. అయితే  ఈ సర్జికల్ రోబో సేవలను విజయవాడ వాసులకు, తెలుగు ప్రజలకు చేరువ చేయాలని భావించిన ప్రశాంత్ హాస్పిటల్ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. నాసా సహకారంతో తయారుచేసిన సర్జికల్ రోబో సహకారంతో డాక్టర్లు మరింత సులువుగా ఆపరేషన్లు చేయవచ్చని... దీని సృష్టి ఓ అద్భుతమని ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పాటు ఇతర అతిథులు కొనియాడారు.