రక్షా బంధన్ : కేటీఆర్ కు రాఖీ కట్టిన కల్వకుంట్ల కవిత..
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తనకు రాఖీ కట్టిన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌కు రాఖీ కట్టిన అనంతరం కవిత.. రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్‌కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం పార్టీ మహిళా నేతలు మంత్రి సత్యవతి రాథోడ్, కవితా మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, గండ్ర జ్యోతి, గుండు సుధారాణిలు కూడా ప్రగతి భవన్ లో కేటీఆర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.