జగన్ మీద చంద్రబాబు: ఒక్కరోజైనా అచ్చెన్నను జైల్లో పెట్టాలని...

ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 

First Published Jul 2, 2020, 2:12 PM IST | Last Updated Jul 2, 2020, 2:12 PM IST

ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దాంతో ఏసీబీ అధికారులు ఆయన్ను నేరుగా సబ్‌జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు ఖైదీ నెంబర్ 1573 ని కేటాయించారు. భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. ఐతే కోవిడ్ టెస్ట్ చేశాక, రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.