Asianet News TeluguAsianet News Telugu

ఏనుగుల గుంపు హల్ చల్... గ్రామాల శివార్లలోనే ప్రసవించిన ఏనుగు

విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు హాల్ చల్ చేస్తోంది. 

విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు హాల్ చల్ చేస్తోంది. కళ్లికోట-దుగ్గి గ్రామాల మధ్య తిష్ట వేసిన ఏనుగుల గుంపు స్థానికులకు కంటి మీద కునుకు  లేకుండా చేస్తోంది. ఇది చాలదన్నట్లు తాజాగా ఓ గున్న ఏనుగు ఈ గుంపులో చేరింది. ఈ గ్రామాల శివారులోనే ఓ ఏనుగు గున్న ఏనుగుకు  జన్మనిచ్చింది.  దీంతో ఇప్పటివరకు ఐదు ఏనుగుల గుంపుకు తోడుగా మరో పిల్ల ఏనుగుతో చేరింది. ఈ ఏనుగుల గుంపు మన్యంలో అలజడి సృష్టించి పోడు వ్యవసాయంతో పాటుగా వరి పంటలను ధ్వంసం చేస్తోంది. దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.