వైఎస్ సన్నిహితుడితో జగన్ కు కొత్త చిక్కులు.. మారుతున్న గన్నవరం సమీకరణాలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తాజాగా గన్నవరం నియోజకవర్గ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తాజాగా గన్నవరం నియోజకవర్గ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశి టీడీపీ ని వీడి అనధికారికంగా వైసీపీలో చేరడంతో సహజంగానే ఆ నియోజకవర్గ విషయాలపై ఆసక్తి అధికమయ్యింది. ఇప్పుడు తాజాగా అక్కడ వైసీపీలో వంశీకి ఎదురవుతున్న ఇబ్బందులతో... అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.