Asianet News TeluguAsianet News Telugu

దుగ్గిరాల ఎంపిపి ఎన్నికపై ఉత్కంఠ... పోలీసులు హైఅలర్ట్, భారీ బందోబస్తు ఏర్పాటు

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపిపి ఎన్నిక రసవత్తరంగా మారింది.

గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపిపి ఎన్నిక రసవత్తరంగా మారింది. స్థానికసంస్థల ఎన్నికల్లో టిడిపి మెజారిటీ ఎంపిటిసి స్థానాలు దక్కించుకున్నప్పటికి ఎంపిపి పదవిని దక్కించుకోలేకపోతోంది. దుగ్గిరాల ఎంపీపీ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేయగా టిడిపి ఎంపిటీసిల్లో బిసి మహిళలు లేరు. షేక్ జబీన్ ను ఎంపీపీ అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించినా ఆమెకు బీసీ సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యం కాదని కలెక్టర్ తేల్చి చెప్పారు. దీంతో టిడిపికి మెజారిటీ వున్నా అభ్యర్థి లేకపోవడంతో ఎంపిపి స్థానాన్ని దక్కించుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. ఇవాళ(గురువారం) ఎంపిపి ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే వైసిపి ఎంపిటిసిలతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, టిడిపి ఎంపిటిసిలు ప్రత్యేక బస్సులు ఎంపిపి కార్యాలయానికి చేరుకున్నారు. 

ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేసారు. ముందుగానే అలెర్టయిన దుగ్గిరాలలో పోలీసులు పట్టణంలో పదిచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటుచేసారు. ఎంపీడీవో కార్యాలయం వైపు ఎవరూ రాకుండా తనిఖీలు చేపట్టారు. ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐల ఆధ్వర్యంలో మొత్తం 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసారు.    

Video Top Stories