Video : గూడూరులో పెరిగిన కుక్క కాటు కేసులు
కృష్ణా జిల్లా, గూడూరు సామాజిక వైద్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో కలెక్టర్ ఇంతియాజ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కృష్ణా జిల్లా, గూడూరు సామాజిక వైద్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో కలెక్టర్ ఇంతియాజ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రి 11గంటల సమయంలో హంగూ అర్భాటం లేకుండా తనిఖీకి వచ్చిన కలెక్టర్ ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. అన్ని రకాల మందు అందుబాటులో ఉన్నదీ లేనిదీ వైద్యులని అడిగి తెలుసుకున్నారు. కుక్క కాటు కేసులు ఎక్కువగా వస్తున్నాయని, యాంటీ రేబీస్ వాక్సిన్ ప్రైవేటు గా తెప్పించి వేస్తున్నామని డాక్టర్ వాసవిలత కలెక్టర్ కు తెలిపారు. హెల్త్ సెంటర్ పక్కనున్న బ్లాక్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో ప్రారంభింప చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.