ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతలు... ఆందోళనలో గ్రామస్తులు
తాడేపల్లి : మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్దిలో భాగంగా ఇప్పటంలో ఇళ్ళ కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే.
తాడేపల్లి : మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్దిలో భాగంగా ఇప్పటంలో ఇళ్ళ కూల్చివేతలు ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన ఇళ్ళ కూల్చివేతలు, బాధితులకు పవన్ కల్యాణ్ మద్దతు, ఆర్థిక సాయం... ప్రభుత్వ చర్యలకు అధికార వైసిపి మద్దతులో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కొద్దిరోజులు నిలిచిపోయిన కూల్చివేతలు తాజాగా మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ కూల్చివేతలపై తమకు అనుమానాలున్నాయని... రోడ్డు విస్తరణపై రీసర్వే నిర్వహించాలని బాధితులు కోరుతున్నారు. ఈ మేరకు మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కమీషనర్ ను మెమరాండం ఇవ్వాలని ఇప్పటం గ్రామస్థులు నిర్ణయించారు.