వైసిపి ఎమ్మెల్సీ కారులో మృతదేహం... కొట్టిచంపారంటూ మృతుడి కుటుంబం ఆందోళన
కాకినాడు: అధికార వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపింది. గతంలో ఎమ్మెల్సీ వద్ద కారు డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. అయితే అతడి మృతదేహాన్ని ఎమ్మెల్సీ తన కారులో వేసుకుని కుటుంబసభ్యుల వద్దకు తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతిచెందాడని వారికి తెలిపాడు.
కాకినాడు: అధికార వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపింది. గతంలో ఎమ్మెల్సీ వద్ద కారు డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. అయితే అతడి మృతదేహాన్ని ఎమ్మెల్సీ తన కారులో వేసుకుని కుటుంబసభ్యుల వద్దకు తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతిచెందాడని వారికి తెలిపాడు. కానీ ఎమ్మెల్సీపైనే అనుమానం వ్యక్తంచేయడంతో కారును అక్కడే వదిలి అనంతబాబు వెళ్ళిపోయారు. అనంతబాబే దారుణంగా కొట్టడంతో సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కారులోని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహాన్ని తరలించడాన్ని అడ్డుకోవడంతో మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది.