కర్నూలు జిల్లాలో కాకుల కలకలం.. ఒక్క కాకి కోసం... (వీడియో)
కరోనా కారణంతో మనిషికి, మనిషే సాయం చేయని ఈ రోజుల్లో ఓ కాకిని కాపాడి మానవత్వం చాటుకున్నారు ఆ యువకులు.
కరోనా కారణంతో మనిషికి, మనిషే సాయం చేయని ఈ రోజుల్లో ఓ కాకిని కాపాడి మానవత్వం చాటుకున్నారు ఆ యువకులు. కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలం సుండి పెంట బస్టాండ్ వద్ద ఓ విచిత్రం చోటు చేసుకుంది. కరెంటు స్తంభం వైరల్లో ఓ కాకి ప్రమాదవశాత్తు చిక్కుకుంది. దీంతో కాకి అరుపులకు.. వందలకొద్దీ కాకులు జమవ్వడంతో ఆ ప్రాంతమంతా కాకి అరుపులతో మారుమ్రోగిపోయింది. దీంతో స్థానికులు తమ ప్రయత్నాలు చేస్తూనే అటవీశాఖ వారికి సమాచారం అందించారు. అయితే సుండిపెంటకు చెందిన కొందరు యువకులు కర్రల సాయంతో కాకికి పడ్డ చిక్కుముడి విప్పడంతో కాకి ఎగిరిపోయింది.