తుళ్లూరులో ఉద్రిక్తత... సీఆర్డిఏ కార్యాలయం వద్ద పోలీసులు, సిపిఎం నాయకుల తోపులాట

అమరావతి: హైకోర్టు ఆదేశాలను పాటించి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు తుళ్లూరు రైతు దీక్షా శిబిరం నుండి సీఆర్డీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 

First Published Mar 21, 2022, 5:22 PM IST | Last Updated Mar 21, 2022, 5:22 PM IST

అమరావతి: హైకోర్టు ఆదేశాలను పాటించి అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు తుళ్లూరు రైతు దీక్షా శిబిరం నుండి సీఆర్డీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఆర్డీఏ కార్యాలయంలోకి సిపిఎం నాయకులను పోలీసులను అనుమతించలేదు. కేవలం నలుగురికి మాత్రమే వినతిపత్రం అందించేందకు అవకామిస్తామని పోలీసులు చెప్పారు. కానీ పోలీసులను తోసుకుని సిఆర్డిఏ కార్యాలయంలోకి గుంపుగా వెళ్లేందుకు సిపిఎం నాయకులు ప్రయత్నించారు. దీంతో తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్తత నెలకొంది. 
దీంతో పోలీసులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబూరావు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు, డివిజన్ కార్యదర్శి ఎం రవి, దళిత జెఎసి కన్వీనర్ గడ్డం మార్టిన్, ఎం భాగ్యరాజు లను అరెస్ట్ చేసారు.