వైసిపి ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ ప్రచారం... సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ క్లారిటీ

విజయవాడ : అధికార వైసిపిలో చేరనున్నట్లుగా తనపై జరుగుతున్న ప్రచారంపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ. గఫూర్ స్పందించారు.

First Published Feb 20, 2023, 1:55 PM IST | Last Updated Feb 20, 2023, 1:55 PM IST

విజయవాడ : అధికార వైసిపిలో చేరనున్నట్లుగా తనపై జరుగుతున్న ప్రచారంపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ. గఫూర్ స్పందించారు.యాభై ఏళ్ళుగా సిపిఎంలో కొనసాగుతున్నానని... ఇప్పుడు కేవలం ఎమ్మెల్సీ పదవికోసం పార్టీని వీడితే అది తనకే అవమానకరం అని అన్నారు.  వైసిపి పార్టీలో చేరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లుగా జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమంటూ మీడియాలో వస్తున్న కధనాలను కొట్టిపారేసారు. తాను ఎవ్వరినీ కలవలేదు... ఏ పార్టీ కూడా తనను సంప్రదించలేదని అన్నారు. ఏ సమస్యలున్నా పార్టీలో వుండే పరిష్కరించుకుంటానని... ఇతర ఏ పార్టీలో చేరబోనని గఫూర్ స్పష్టం చేసారు