ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం...: జగన్ సర్కార్ పై సిపిఐ రామకృష్ణ ఆరోపణలు
విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేసయినా గెలవాలని భావిస్తున్న అధికార వైసిపి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని...
విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం చేసయినా గెలవాలని భావిస్తున్న అధికార వైసిపి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని... ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రచారానికి వినియోగించుకుంటోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ఇందులో భాగంగానే ముందునుండి వైసిపి కార్యకర్తలా వ్యవహరించే ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగారన్నారు. సాక్షాత్తు యూనివర్సిటీ విసి, రిజిస్ట్రార్ లే దస్పల్లా హోటల్లో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టి వైసిపి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టారని ఆరోపించారు. ఇంత దిగజారిన పరిస్థితి ఏనాడూ లేదని... ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించడం లేదన్నారు. ఇక కడప, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఆర్జెడి ప్రతాప్ రెడ్డి నిస్సిగ్గుగా మీటింగ్ లు, గిప్టుల పంపిణీ చేస్తున్నారని... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చుల కోసం ఏకంగా రూ.20 కోట్లు దగ్గరపెట్టుకున్నారని అన్నారు. ఇలా ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని వైసిపి ప్రభుత్వం చూస్తోందని సిపిఐ రామకృష్ఱ ఆరోపించారు.