కన్నబిడ్డ శవంతో 120కి.మీ స్కూటీపైనే తల్లిదండ్రులు... విశాఖలో హృదయవిదారక ఘటన
విశాఖపట్న : ఇటీవలే ఓ వ్యక్తి భార్య మృతదేహాన్ని భుజానేసుకుని విశాఖపట్నం నుండి కాలినడనక ఒడిషాకు వెళ్ళడానికి ప్రయత్నించాడు...
విశాఖపట్న : ఇటీవలే ఓ వ్యక్తి భార్య మృతదేహాన్ని భుజానేసుకుని విశాఖపట్నం నుండి కాలినడనక ఒడిషాకు వెళ్ళడానికి ప్రయత్నించాడు... అంతకు ముందు తిరుపతిలో ఒకాయన కొడుకు మృతదేహాన్ని బైక్ పై ఇంటికి తరలించాడు. ఇలాంటి హృదయవిదారక ఘటనలను మరిచిపోకముందే మరో విషాదకర ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. కన్నబిడ్డ చనిపోయి పుట్టెడు ధు:ఖంలో వున్న తల్లిదండ్రులు కన్నీటిని దిగమింగుతూనే 120 కి.మీ స్కూటీపైనే మృతదేహాంతో ప్రయాణించారు. ప్రభుత్వ అంబులెన్స్ ఇవ్వకపోవడం, ప్రైవేట్ అంబులెన్స్ లో తరలించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు విశాఖపట్నం నుండి పాడేరుకు స్కూటీపైనే మృతదేహాన్ని తరలించారు. అంబులెన్స్ కోసం ఎంతలా ప్రాధేయపడినా కేజిహెచ్ సిబ్బంది కనికరించలేదని... అందువల్లే గత్యంతరం లేక స్కూటీపై బిడ్డ మృతదేహాన్ని తరలించినట్లు బాధిత తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.