కానుకల్లోనూ ఈవో వాటా వీడియో వైరల్... మంగళగిరి ఆలయ ప్రధానార్చకుడి రియాక్షన్
గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో అర్చకులకు కానుక రూపంలో వచ్చే డబ్బుల్లో వాటా కావాలని డిమాండ్ చేసినట్లుగా సోషల్ మీడియాతో పాటు కొన్ని ఛానళ్లలో ఓ వీడియో ప్రసారమయ్యింది.
గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో అర్చకులకు కానుక రూపంలో వచ్చే డబ్బుల్లో వాటా కావాలని డిమాండ్ చేసినట్లుగా సోషల్ మీడియాతో పాటు కొన్ని ఛానళ్లలో ఓ వీడియో ప్రసారమయ్యింది. అర్చకులు రూ.50 వేలు ఇవ్వాలని అడిగినట్లుగా అర్చకుడితో ఎవరో మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోపై తాజాగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో కోటిరెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ దీక్షితులు స్పందించారు. అర్చకులను తాను డబ్బులివ్వాలని డిమాండ్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు ఈవో కోటిరెడ్డి. కావాలనే ఎప్పటి వీడియోనో ఇప్పుడు ప్రచారం చేస్తూ తనపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆలయ అభివృద్ది కోసం తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నానని... అవి నచ్చకే కొందరు ఇలా దుష్ఫ్రచారం చేస్తున్నారని అన్నారు. ఇక ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు సైతం ఈవో తమను డబ్బులేమీ డిమాండ్ చేయలేదని అన్నారు.