దేవాదాయ ఈవోల మీటింగ్ తెల్లారే.. కమిషనర్ కి కరోనా నిర్థారణ..
కర్నూలు జిల్లా దేవాదాయ శాఖలో రీజినల్ జాయింట్ కమిషనర్ కి కరోనా పాజిటివ్ రావటంతో కలకలం మొదలయ్యింది.
కర్నూలు జిల్లా దేవాదాయ శాఖలో రీజినల్ జాయింట్ కమిషనర్ కి కరోనా పాజిటివ్ రావటంతో కలకలం మొదలయ్యింది. తిరుపతిలోని కార్యాలయానికి వెళ్లివచ్చాక కరోనా వచ్చిందని అంటున్నారు. అయితే మంగళవారంనాడు కర్నూలులో ఉన్న దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఈవో ల సమావేశం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 35 మంది ఈవోలకు గాను 16 మంది ఈఓలు హాజరు అయ్యారు. సమావేశం ముగిసిన కరోనా నిర్ధారణ కావడంతో కార్యాలయ ఉద్యోగులతో పాటు, పనిచేస్తున్న సిబ్బందికి, ఏసీ సమావేశానికి హాజరైన ఈవోలకు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇది తెలుసుకున్న జిల్లా అధికారులు వీరందరికీ కరోనా టెస్టులు చేయాలని డాక్టర్లను ఆదేశించడంతో కృష్ణానగర్ సచివాలయంలో వీరందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు.