Corona Third Wave:మా ప్రాంతంలో కోవిడ్ నియంత్రణ చర్యలొద్దు..: నూజివీడు వాసుల వింత డిమాండ్
నూజివీడు: కరోనా థర్డ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అదే ప్రజలు అడ్డుకుంటున్నారు.
నూజివీడు: కరోనా థర్డ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అదే ప్రజలు అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని కోనేరుపేటలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతుండగా... దానిని స్థానికులు వ్యతిరేకిస్తూ ఏకంగా ఆందోళనకు దిగారు. ఓ కల్యాణమండపంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా... చుట్టుపక్కల ప్రజల దీన్ని తొలగించాలని కోరుతున్నారు.