నిండు గర్భిణీకి కరోనా.. 108లోనే ప్రసవం చేసిన సిబ్బంది..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం గ్రామనికి చెందిన పెద్ద లాలమ్మ మూడవ కాన్పుకు చికిత్స కోసం స్థానిక PHCకి వెళ్తే, లాలమ్మకు కరోనా టెస్ట్ చెయ్యగా కరోనా పాజిటివ్ గా వెల్లడయ్యింది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం గ్రామనికి చెందిన పెద్ద లాలమ్మ మూడవ కాన్పుకు చికిత్స కోసం స్థానిక PHCకి వెళ్తే, లాలమ్మకు కరోనా టెస్ట్ చెయ్యగా కరోనా పాజిటివ్ గా వెల్లడయ్యింది. దీంతో లాలమ్మకు మెరుగైన వైద్యసేవల కోసం రుద్రవరం నుండి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్ లోనే ప్రసవించింది. గర్భిణికి కరోనా పాజిటివ్ అని తెలిసినా దైర్యంగా, మానవత్వంతో గర్భిణికి కాన్పు సమయంలో సహాయపడి ప్రసవ సమయంలో దగ్గరుండి సేవలు చేసిన 108 అంబులెన్స్ టెక్నిషియన్ జీవన్ ను అందరూ అభినందించారు.