నీలం సంజీవరెడ్డి 109 జయంతి... నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేత తులసి రెడ్డి
అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి, తెలుగు బిడ్డ స్వర్గీయ నీలం సంజీవరెడ్డి 109వ జయంతి సదర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి నివాళులు అర్పించారు.
అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి, తెలుగు బిడ్డ స్వర్గీయ నీలం సంజీవరెడ్డి 109వ జయంతి సదర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసిరెడ్డి నివాళులు అర్పించారు. సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసిన తులసి రెడ్డి తోటి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నీలం సంజీవరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేసారు.
ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ... నీతికి, నిజాయితీకి, నిర్భీతికి నిలువటద్దం నీలం సంజీవరెడ్డి అన్నారు. స్యయం కృషి, స్వీయ ప్రతిభతో పల్లె నుండి ఢిల్లీ వరకు, రైతు నుండి రాష్ట్రపతి వరకు ఎదిగిన నాయకుడు సంజీవ రెడ్డి అంటూ కొనియాడారు. బస్సుల జాతీయకరణ విషయంలో కోర్టులు ప్రతికూల వ్యాఖ్యలు చేసినందులకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన నైతిక విలువలు పాటించారన్నారు. సంజీవ రెడ్డికి నేటి ముఖ్యమంత్రికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు తులసిరెడ్డి.