దేవాలయాలపై వరుస దాడులు... సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఎండోమెంట్ పరిధిలోకి రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల పర్యవేక్షణలో ఉన్న దేవాలయాల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష టిడిపి పద్ధతి ప్రకారం కుట్రలు చేస్తున్నారని, పొలిటికల్ గొరిల్లా వార్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి, పోలీసులకు చెడ్డపేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని, వీటిని ఎలా అరికట్టాలన్న దానిపై కూడా మేదోమథనం చేయాలని సీఎం జగన్ అన్నారు.