స్విట్జర్లాండ్ నుండి స్వరాష్ట్రానికి సీఎం జగన్... గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం
అమరావతి: వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
అమరావతి: వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. దావోస్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు మంత్రులు, అధికారులు, వైసిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.