రెండో దశ పశువుల అంబులెన్సులు జండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్

తాడేపల్లి : డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవలో భాగంగా రెండో దశ పశువుల అంబులెన్సులు సీఎం జగన్ జండా ఊపి ప్రారంభించారు.

First Published Jan 25, 2023, 4:30 PM IST | Last Updated Jan 25, 2023, 4:30 PM IST

తాడేపల్లి : డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్యసేవలో భాగంగా రెండో దశ పశువుల అంబులెన్సులు సీఎం జగన్ జండా ఊపి ప్రారంభించారు.
వీటితో పశువులకు అంబులెన్స్‌ సేవలు మరింత విస్తృతం అవుతాయని తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌ల ఏర్పాటు చేశారు. 

ఇప్పటికే మొదటి దశలో రూ.129.07 కోట్ల వ్యయంతో 175 పశుఅంబులెన్స్‌ల ద్వారా 1,81,791 పశువులను ప్రాణాపాయం నుంచి రక్షించి 1,26,559 మంది పశు పోషకులకు లబ్ధిచేకూర్చారు. రెండో దశలో భాగంగా రూ.111.62 కోట్ల వ్యయంతో ఇవాళ మరో 165 పశు అంబులెన్స్‌ వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జెండా ఊపి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రారంభించారు