Video:భార్యను కాపురానికి పంపించమని అడిగినందుకు..
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం , శ్రీనివాసపురం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాలుకర్రలు,గొడ్డలితో దాడులు చేసుకున్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం , శ్రీనివాసపురం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాలుకర్రలు, గొడ్డలితో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. రామకృష్ట అనే వ్యక్తి తన భార్యను కాపురానికి
పంపించమని అడిగే క్రమంలో ఈ వివాదం చెలరేగింది.